AP: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే స్త్రీశక్తి పథకం ప్రారంభం కానుంది. ఈ వేడుకను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఈ పథకాన్ని విజయవాడలో ప్రారంభిస్తారన్నారు. డిప్యూటీ సీఎం, జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆర్టీసీ చైర్మన్, ఎంపిక చేసుకున్న జిల్లా/నియోజకవర్గ పరిధిలో పాల్గొంటారని తెలిపారు.
Post Views: 71







