Mahaa Daily Exclusive

  బంద్ లో పాల్గొన్న వీహెచ్ కు అస్వస్థత

Share

హైద‌రాబాద్‌, మహా : జస్టిస్ ఫర్ బీసీ బంద్ లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. అంబర్ పేట్ లో నిర్వహించివన ర్యాలీలో నడుస్తూ వీహెచ్‌ తూలి ప‌డిపోయారు. వెంటనే పక్కన ఉన్న నేతలు ఆయనను పైకి లేపారు. ఇటీవలే వీహెచ్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అస్వ‌స్థ‌త‌కు గురై తూలి ప‌డి ఉంటార‌ని ప‌లువురు భావిస్తున్నారు. కొంత సేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి ర్యాలీలో వీహెచ్ పాల్గొన్నారు