Mahaa Daily Exclusive

  మేమెంతో మాకంత కావాలి …బీసీలను మొదటి మోసం చేస్తుంది కాంగ్రెస్, బీఆర్ఎస్.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

Share

హైదరాబాద్, మహా: బీసీలను మొదటి నుంచి మోసం చేస్తుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. బీసీ సంఘాల రాష్ట్ర బంద్ కు మద్దతుగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బంద్ లో ఈటల బీజేపీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారని.. అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారు అని విమర్శించారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని…21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు బీసీల ఆర్థిక, సామాజిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి.. ఆ రిపోర్ట్ తో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ లో చేర్చారు అని ఈటల తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ఒక సారి సర్వే చేసి.. బీసీ కమిషన్ వేశారని..వారికి నిజాయితీ లేదు కాబట్టి బీసీ రిజర్వేషన్ అమలు కాలేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేరుకు కమీషన్లు వేశారు తప్ప నిజాయితీ లేదు అని..లెక్కలు తీశారని, కానీ అవన్నీ తప్పుల తడకగా ఉన్నాయని, 52 శాంతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెప్తున్నారని ఆరోపించారు. నేను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. నేను మాట్లాడిన మాటలపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అన్నారు. బీసీలు మేమెంతో మాకంత కావాలని.. యాచించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో ఉన్నాం అన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబం వారికే అధికారం దక్కుతుందని, కుటుంబమే ఏలుతుందని ఈటల స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా.. స్వతంత్రం వచ్చినప్పటినుండి ఒక్క బీసీ, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేక పోయారు అన్నారు. ఈ రాష్ట్రంలో బీసీలు 8 మంది మంత్రులుండాలి.. కానీ ముగ్గురున్నారు