Mahaa Daily Exclusive

  మోడీ బీసీగా కన్వర్ట్ అయ్యారు..బీసీ బంద్ కార్యక్రమంలో మంత్రి తుమ్మల

Share

  • మోడీ బీసీగా కన్వర్ట్ అయ్యారు
  • బీసీ కాకపోయినా తన సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చింది
  • బీసీ బంద్ కార్యక్రమంలో మంత్రి తుమ్మల

ఖమ్మం, మహా: కులగణన ఆధారంగా బీసీల రిజర్వేషన్ల కోసం శాసనసభలో అన్ని పార్టీల ఆమోదం తీసుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు ద్వారా న్యాయం కోసం ముందుకెళ్లామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లిలో చేపట్టిన బీసీ బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా రాజ్యాంగబద్ధంగా అందరికీ సమన్యాయం జరిగి, రాజ్యాధికారం కల్పించాలనేదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్దేశమని పేర్కొన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో చట్ట సవరణ ద్వారానే ప్రధానమంత్రి మోదీ బీసీగా కన్వర్ట్ అయ్యారని మంత్రి తుమ్మల తెలిపారు. నరేంద్ర మోదీ కులం బీసీ కాకపోయినా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆయన సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చిందని పేర్కొన్నారు. బీసీగా ప్రధానమంత్రి స్థానం దక్కించుకున్న మోదీ, తెలంగాణలో బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు