హైదరాబాద్, మహా:బీసీ ఫర్ జస్టిస్ పేరుతో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీసీ జేఏసీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బీసీ నేతలు పల్లె రవికుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, అంజనేయులు గౌడ్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, తుల ఉమ, రాజయ్య యాదవ్ తదితర నేతలు తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు ర్యాలీగా వెళ్లి రహదారిపై బైఠాయించారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, మాజీ ఎమ్మెల్యే దాస్య వినయ్ భాస్కర్, మన్నె గోవర్ధన్‌రెడ్డి తదిరత నేతలు పాల్గొన్నారు.
Post Views: 35








