Mahaa Daily Exclusive

  ఎవరు గెలవాలి.. లేడీనా? రౌడీనా? – జూబ్లీహిల్స్ ఓటర్లు తేల్చుకోవాలి: హరీశ్ రావు

Share

హైదరాబాద్, మహా
హైదరాబాద్ షేక్ పేట్ లోని అంబేద్కర్ నగర్ లో కార్నర్ మీటింగ్ లో మాజీమంత్రి హరీశ్ రావు మాట్లాడారు. మీరందరూ ఇష్టపడి గెలిపించుకున్న మాగంటి గోపీనాథ్ అనారోగ్యం కారణంగా చనిపోవడం దురదృష్టకరం అని ఆయన వాపోయారు. మగ దిక్కు లేని ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిల్చుందన్నారు. గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు వారి సతీమణికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందన్నారు. ”ఎవరు గెలవాలి.. లేడీనా? రౌడీనా? నేను మీకు మాటిస్తున్నా. నా ఇల్లు ఇక్కడి నుంచి 10 నిమిషాలు దూరం. మీ బస్తీ సమస్యలను పరిష్కరించేందుకు.. మీకు ఏ ఆపద ఉన్నా, ఏ పని పడ్డా సునీతమ్మ ఒకటే కాదు మేమందరం ఆమె కోసం అండగా ఉంటాం. మీకు సేవ చేస్తాం అని అన్నారు