- బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతాం
- మోడీ విదేశాంగ విధానం సరిగ్గా లేదు
- ట్రంప్ అంటే ప్రధాని మోడీకి భయం
- మోడీ దుర్మార్గాలాను ఒక్కొక్కటిగా భయటపెడతున్నాం
- వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి
- వికారాబాద్ లో డీసీసీ అధ్యక్షుల సమావేశఁలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ
వికారాబాద్, మహా : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టనున్నట్టు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా బయట పెడుతున్నామని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని డీసీసీ చీఫ్ లకు రాహుల్ గాంధీ సూచించారు. తెలంగాణలో పార్టీ.. ప్రభుత్వం కలిసి మంచిగా పనిచేస్తున్నాయని రాహుల్ కితాబిచ్చారు. సామాజిక అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరిగిన ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమానికి ఇవాళ రాహుల్ గాంధీ హాజరైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తెలంగాణలో జన గణన పూర్తి చేసి బీసీ జనాభా తేల్చినా కేంద్రం వారికి రావాల్సిన రిజర్వేషన్లపై తాత్సారం చేస్తుందని, దీన్ని పార్లమెంట్ వేదికగా ప్రశ్నిస్తామని, బీసీ రిజర్వేషన్ల కోసం ప్రైవేట్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెడుతామన్నారు.
ప్రధాని మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం సక్రమంగా లేదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇరాన్ లాంటి పరిస్థితులు దేశానికి రాకుండా ఉండాలన్నారు. మోడీ ప్రభుత్వ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ తో ప్రమాదం ఉందన్నారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం లోపభూయిష్టంగా ఉందని, ఈ విదేశాంగ విధానం వల్ల భవిష్యత్ లో భారత్ భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడి కనుసన్నల్లో ప్రధాని మోడీ పని చేస్తున్నారని, ట్రంప్ అంటే మోడీ భయమని అన్నారు. పాకిస్తాన్ తో యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పదే పదే చెబుతున్నా మోడీ ఆ విషయంపై దేశ ప్రజలకు శ్పష్టత ఇవ్వక పోవడం చూస్తుంటే ఆయన పని తీరు ఎలా ఉందో స్పష్టమవుతుందన్నారు. 12 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అదోగతి పాలైందని, ఆయన అనుసరిస్తున్న విధానమే ఇందుకు కారణమన్నారు. దేశ ప్రజల్లో విద్వేషాలను రేకెత్తించడమే పనిగా పెట్టుకుని పని చేస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
మోడీ ద్వంద్వ వైఖరి, విధానాలపై ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ లో ప్రతి నిత్యం అనేక అంశాలపై ప్రశ్నిస్తున్నామని, ఏ అంశంపై కూడా మోడీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. విదేశాంగా విధానంగా ఎఫ్టిన్ ఫైల్స్ కు సంబంధించి కానీ, దేశ రక్షణ అంశం కానీ ప్రజా సమస్యలపై కానీ ఇలా ఏ రంగంపై ప్రశ్నించిన దాటవేత దోరణిని అవలంభించడంపై ప్రజలను జాగరూకులను చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు. రాబోయే కాలంలో అడుగడుగునా మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తాము లేవనెత్తిన ప్రతి అంశం ప్రజలకు సంబంధించేనని, ప్రజల ముందు నరేంద్ర మోడీని దోషిగా నిలబెడతామన్నారు.








