ఢిల్లీ: ఈ నెల మూడో తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఆ రోజు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుందని తెలిపింది. చంద్రగహణాన్ని వీక్షించే అవకాశం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా గ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకే ప్రారంభమైనప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాతే ప్రభావం కనిపిస్తుంది. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని వీక్షించే అవకాశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉంటుందని తెలిపింది. మళ్లీ ఇలాంటి చంద్ర గ్రహణం 2028, జూలై 6న ఏర్పడుతుందని వెల్లడించింది.
Post Views: 8








