- ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు.?
- గత నెలలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు
- ఇబ్రహీంపట్నంలో నిలిచిన చైర్మన్ ఎన్నిక
- మూడు వారాల్లో ఎన్నిక పూర్తి చేయాలి: హైకోర్టు ఆదేశాలు.?
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మూడు వారాల్లోగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి, తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌన్సిలర్లు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా తమ మద్దతు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలిపింది.
గత నెలలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు….
రాష్ట్రవ్యాప్తంగా గత ఫిబ్రవరి నెలలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో, రంగారెడ్డి జిల్లాలో ఆరు మున్సిపాలిటీలో ఎన్నికలు జరగగా, ఐదు మున్సిపాలిటీలలో ఫలితాలు వచ్చి, చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగి, పూర్తిస్థాయి పాలకవర్గం ఏర్పాటు అయ్యి పరిపాలన కొనసాగుతుంది.
ఇబ్రహీంపట్నంలో వీటన్నిటికి విరుద్ధంగా…
జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లకు, ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం అనంతరం రిటర్నింగ్ అధికారి, నియామక పత్రాన్ని అందజేశారు. ఇదే క్రమంలో అదే రోజు జరగాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పలు కారణాల వల్ల రిటర్నింగ్ అధికారి మరుసటి రోజుకు వాయిదా వేశారు. ఫిబ్రవరి 17న జరగాల్సిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో, చైర్మన్ ఎన్నికను నిలిపివేయాలని, ఎన్నికపై స్టే విధించారంటూ, హైకోర్టు నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా, చైర్మన్ ఎన్నిక ప్రక్రియను, రిటర్నింగ్ అధికారి ఆర్డిఓ అనంతరెడ్డి మధ్యలోనే నిలిపివేశారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోర్టుకు వెళ్లడంతో మున్సిపాలిటీ పూర్తిస్థాయి పాలకవర్గ నియామకం నిలిచిపోయింది. మంగళవారం తెలంగాణ హైకోర్టు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను మూడు వారాలలో పూర్తి చేయాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కోర్టు ఆదేశాలు జారీ చేశారంటూ సమాచారం.?
ఇబ్రహీంపట్నం ‘పీఠం’పై హైకోర్టు తుది తీర్పు.?
మూడు వారాల లోపు ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. కౌన్సిలర్లు ఎవరి ఒత్తిడికి లోనవ్వకుండా స్వచ్ఛందంగా తమ మద్దతును తెలుపేలా చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఛైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేవలం ఎన్నికల రిటర్నింగ్ అధికారిది అని హైకోర్టు తేల్చి చెప్పింది.?








