Mahaa Daily Exclusive

  పెట్రో ఉత్పత్తుల ఆందోళన అవసరం లేదు.-:కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..

Share

మహా

అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో.. అంతర్జాతీయంగా చమురు సరఫరా, భారతదేశంలో పెట్రో ఉత్పత్తుల అందుబాటుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంది.

భారతదేశం రిఫైనరీ విషయంలో నాలుగో స్థానం, ఎగుమతుల విషయంలో ఐదో స్థానంలో ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలతో భారతదేశానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు.

దేశంలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి పెట్రోలియం ఉత్పత్తులు, క్రూడ్ ఆయిల్ నిల్వలు సరిపడా ఉన్నాయి అని మంత్రి పేర్కొన్నారు. భారత్‌లో 25 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ స్టాక్ ఉందని కేంద్రం ప్రకటించింది. .40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ చేరుకున్న విమానం

Latest