- తెలుగుదేశం పార్టీలో కీలక నియామకాలు
- సంస్థాగత మార్పులకు శ్రీకారం
- జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్
- జాతీయ ఉపాధ్యక్షుడిగా సానా సతీష్ బాబు నియామకం
అమరావతి, మహా : తెలుగుదేశం పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుడుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడం, ఆధునిక విధానాలతో ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ను నియమించారు. యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ, పార్టీ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా, కాకినాడ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, అనుభవాన్ని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
తమను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు సానా సతీష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, కార్యకర్తలతో కలిసి పార్టీ బలోపేతానికి శ్రమిస్తానని పేర్కొన్నారు. అలాగే, నారా లోకేష్‌ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం పట్ల సానా సతీష్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.








