హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ రోజు లక్డికాపూల్ లోని ఒక ప్రైవేట్ హోటల్ లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈ మేరకు ఎన్నిక ప్రక్రియ జరిగింది. తెలంగాణ లో జిమ్నాస్టిక్స్ ఎదుగుదలకు మరింతగా కృషి చేసి మారు మూలల గ్రామాల నుంచి కూడా క్రీడాకారులను ప్రోత్సహించి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని రఘునందన్ రావు పేర్కొన్నారు.
Post Views: 3







