Mahaa Daily Exclusive

  గవర్నర్‌ను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్‌….

Share

  • గవర్నర్‌ను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్‌.
  • లోక్‌భవన్‌లో మర్యాదపూర్వక భేటీ.

హైదరాబాద్‌, మహా.
తెలంగాణ రాష్ట్ర నూతన పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డీజీపీ)గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌ శనివారం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే డీజీపీగా నియామకమై, బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు సీవీ ఆనంద్‌ పుష్పగుచ్ఛం అందజేసి అభివాదం చేయగా, గవర్నర్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
సుమారు కొద్దిసేపు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితులు, పోలీసు శాఖ చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై గవర్నర్‌ ఆరా తీశారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా పనిచేయాలని ఈ సందర్భంగా గవర్నర్‌ సూచించారు. తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తానని, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తానని డీజీపీ సీవీ ఆనంద్‌ గవర్నర్‌కు వివరించారు. ఈ మర్యాదపూర్వక సమావేశంలో రాజ్‌భవన్ ఉన్నతాధికారులతో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.