Mahaa Daily Exclusive

  కొట్లాడి పధకాలు తెచ్చా…

Share

  • కొట్లాడి పధకాలు తెచ్చా
  • అధికారుల పనితీరుతోనే ప్రభుత్వానికి పేరు

కారేపల్లి, మహా : వైరా నియోజవర్గంలో కోట్లాడి పధకాలు తెచ్చానని వాటిని సద్వినియోగం చేసుకోవాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. బుధవారం కారేపల్లి మండలం అప్పాయిగూడెం రైతు వేధికలో సహకారశాఖ, రైతు ఉత్పత్తిదారుల సంస్ధ, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాపాలన ` ప్రగతి నివేదిక (99 రోజుల యాక్షన్ ప్లాన్) కార్యక్రమాన్ని సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో అత్యధికంగా మొక్క్పు£న్న సాగు జరిగిందని మంత్రులు, అధికారులతో కొట్లాడి కొనుగోలు కేంద్రాలు సాధించానన్నారు. ఇతర జిల్లాలకు మొక్కజన్నలు ట్రాన్స్‌పోర్ట్ చేయటంతో లారీ కొరత ఏర్పడిందని, దానికి నిరుపయోగంగా ఉన్న అప్పాయిగూడెం గోదాంను తెరిపించి ట్రాక్టర్ల ద్వారా గోదాంకు తరలించే ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా వ్యవసాయశాఖ, సోసైటీ అధికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బ్యాంకులను వినియోగించుకోని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. సక్రమంగా రెన్యూవల్ చేసుకోనిప్రభుత్వ రాయితీలు పొందాలన్నారు. అధికారులు సూచించినట్లు పంటల మార్పిడి చేసుకోవాలని, పామాయిల్ పంటను వేసుకోవాలన్నారు. కొణిజర్లలో పామాయిల్ ప్యాక్టరీ మంజూరు చేయించినట్లు తెలిపారు. అధికారుల పని తీరుతోనే ప్రభుత్వానికి పేరు వస్తుందన్నారు. రైతు రుణమాఫీ 85 శాతం పూర్తి అయిందని, సాంకేతిక కారణాలతో 15 శాతం పూర్తి కాలేదన్నారు. బ్యాంకర్లు రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాల పంపిణిలో ఇబ్బందులు సృష్టించవద్దని కోరారు. ఈకార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుడివాడ మేరి, ఏవో బీ.అశోక్‌కుమార్, సర్పంచ్‌లు దండు ప్రవీణ్, దారావత్ హేమలతబాలాజీ, బానోత్ హీరాలాల్, మాలోత్ బావుసింగ్, దారావత్ మంగీలాల్, డైరక్టర్లు అడ్డగోడ ఐలయ్య, కొత్తూరి రామారావు, మర్సకట్ల రోషయ్య, డేగల ఉపేందర్, బ్యాంకు మేనేజర్లు బాల రవికుమార్, బొల్లు హనుమంతరావు, తోటకూరి రాము, రవీందర్‌నాయక్, కొంగర వేణు, ఏఈలు వెంకన్న, నాగయ్య, రాజశేఖర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు