- గిరిజనుల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడాలి
- హన్మకొండ రమేష్ నూతన వ్యాపారం లాభదాయకంగా సాగాలి -సుందర్ లాల్
కారేపల్లి,మహా:
ఏజెన్సీ గ్రామాలతో ఉన్న సింగరేణి మండల పరిధిలోని గిరిజనుల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడుతూనే, మిత్రుడు,శ్రేయోభిలాషి హనుమకొండ రమేష్ నూతనంగా ప్రారంభించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ జనరల్ స్టోర్స్ వ్యాపారం లాభదాయకంగా ముందుకు సాగాలని రిటైర్డ్ ఉద్యోగి బానోతు సుందర్ లాల్ కోరారు.అమీటి ఇండియా నూతన షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ వినియోగం పెరిగిందని అన్నారు. సౌర విద్యుత్ శక్తి వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా సోలార్ పలకలను వాడాలని సూచించారు. కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిందని, తదనగుణంగానే వెల్నెస్ ఉత్పత్తులకు మంచి గిరాకీ లభిస్తోందని అన్నారు
Post Views: 57








