Mahaa Daily Exclusive

  తెలంగాణ బీసీ కులాల జాబితాలో కీలక మార్పులు: రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం..

Share

*వెనుకబడిన తరగతుల కోసం తెలంగాణ బీసీ కమిషన్ సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో సామాజిక మరియు విద్యా పరంగా వెనుకబడిన జాబితా లోని కొన్ని కులాలు పేర్ల మార్పు ,పర్యాద పదాలు చేర్చడానికి ఇటీవల కేబినెట్ ఆమోదం*

1.గ్రూప్ – ఏ లో వరుస సంఖ్య 7 లో ” దొమ్మర” అనే పదాన్ని తొలగించి “గడ వంశీయ” గా మార్పు

2.గ్రూప్ – ఏ లో వరుస సంఖ్య 18లో ఉన్న “పిచ్చకుంట్ల” అనే పదాన్ని తొలగించి ” వంశ రాజ్ గా మార్పు”

3 గ్రూప్ – డి లో వరుస సంఖ్య 29 లో ఉన్న “శూద్ర కులం” అనే పదాన్ని తొలగించి ” తమ్మలి (బ్రాహ్మణేతర)” గా మార్పు

4. గ్రూప్ ఏ లోని వరుస సంఖ్య 4 లో ఉన్న పద్ధుకు “శివ క్షత్రియ” పర్యాయ పదం గా చేర్చారు దీంతో “బుడబుక్కల శివ క్షత్రియ” గా మారుతుంది.
.

5.గ్రూప్ – ఏ లోని వరుస సంఖ్య 5 లో “వన్నార్ ” ను తొలగించి “ధోబీ” ని చేర్చి రజక,చాకలి, దోబీ గా నమోదు చేయాలి

6. గ్రూప్ – డి లోని వరుస సంఖ్య 5 లో ” మేరు” ను పర్యాయ పదంగా చేర్చి “మేర, మేరు, చిప్పోలు” గా నమోదు చేయాలి.

7. గ్రూప్ ఏ లోని వరుస సంఖ్య 23 లొ ఉన్న “వీరభద్రియ( వీరముష్టి ,నెట్టి కోటల) ను పర్యాయపదంగా చేర్చి వారి అభ్యర్థన మేరకు “వీరభద్రియ ,వీరముష్టి ,నెట్టి కోటల” గా నమోదు చేయాలి.