- యాదాద్రి నరసన్న సేవలో మంచిరెడ్డి దంపతులు…
- కిషన్ రెడ్డి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంచిరెడ్డి దంపతులు. వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..
రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వారి సతీమణి ముకుందమ్మతో కలిసి, వివాహ వార్షికోత్సవం సందర్భంగా, యాదాద్రి (యాదగిరిగుట్ట) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా.. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనమిచ్చీ తీర్థప్రసాదాలు అందజేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరినట్లు తెలిపారు.
Post Views: 28








