Mahaa Daily Exclusive

  కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్ధార్…

Share

  • కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్ధార్
  • రైతుకు ఇబ్బంది లేకుండా చర్యలు

కారేపల్లి, మహా : కారేపల్లి మండలం మాధారంలో నిర్వహిస్తున్న సోసైటీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని తహసీల్ధార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు శుక్రవారం తనిఖీ చేశారు. ఆకాల వర్షాలు, గాలి దుమారాల నైపధ్యంలో తహసీల్ధార్ మాదారం కేంద్రాన్ని సందర్శించి రైతులను మాట్లాడారు. వర్షాలకు పంట తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. టార్పలిన్ లేని రైతులకు కొనుగోలు కేంద్రం ద్వారా కొన్ని టార్ఫలిన్ అందుబాటులు ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని కోరారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ ప్రత్యేక చొరవతో ప్రారంభించిన అప్పాయిగూడెం మొక్క్పు£న్న స్టాక్ పాయింట్ మండలం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. దానిని వినియోగించుకోని కల్లాలో ఉన్న మొక్కజొన్న పంటను తరలింపుకు సోసైటీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తహసీల్ధార్ వెంట సోసైటీ కార్యదర్శి బొల్లు హనుమంతరావు, ఆరఐ జగదీశ్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు కిలారి అప్పారావు, రైతులు కోయశేషయ్య, భూక్య లాలు తదితరులు పాల్గొన్నారు..