Mahaa Daily Exclusive

  కొబ్బరి చిప్పలు టెంట్ హౌస్ వేలం వాయిదా…

Share

  • కొబ్బరి చిప్పలు టెంట్ హౌస్ వేలం వాయిదా
  • మే 18నవేలంపాట
  • బకాయి చెల్లించని షాప్ కు సీజ్

కారేపల్లి, మహా : సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల కోట మైసమ్మ దేవాలయ ప్రాంగణము నందు శుక్రవారం నిర్వహించిన వేలం పాటలకు కొబ్బరి చిప్పలు టెంట్ హౌస్ వేలంపాటకు సంబంధించి పాటదారులు ఎవరు రాకపోవడంతో మే 18 వ తేదీకి వాయిదా వేసామని దేవాదాయ శాఖ వేణుగోపాలచార్యులు తెలిపారు.టెంటు సామాన్లు సప్లై చేసుకొనుటకు కొబ్బరి చిప్పలు పోగు చేసుకొనుటకు ఒక సంవత్సరం పాటు లీజునకు, ఆలయ ప్రాంగణంలో గల షాపుల లీజు సంవత్సరంనకు వేలం నిర్వహించారు. దుకాణాలకు సంబంధించి ముగ్గురు పా ట దారులు డిపాజిట్ చెల్లించడంతో గత సంవత్సరం కంటే 10 శాతం కిరాయి పెంచి వారికి అప్పగించారు. అయితే రెండో షాప్ కు సంబంధించి సంబంధిత దుకాణ యజమాని11 వేల రూపాయలకు పైగా బకాయి ఉండటంతో ఆ షాపుకు ఎండోమెంట్ ఈవో సిబ్బంది సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో గల ఏడు దుకాణాలకు సంబంధించి మూడు దుకాణాలు సంబంధిత డిపాజిట్ దారులకు కేటాయించామని మిగతావి మే 18వ తేదీన బహిరంగ వేలం ఇస్తామన్నారు. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది పగడాల మోహన కృష్ణ పర్సా లలిత సాయి తదితరులు పాల్గొన్నారు.