హైదరాబాద్, మహా
ప్రజా భవన్‌లో మధుపార్క్ రిడ్జ్ (బి-బ్లాక్) రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రతినిధులతో డిప్యూటీ పీఎం భట్టి విక్రమార్కచ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. మూసీ నది పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, బాధితులకు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా తగిన సహాయం అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు
నగరవాసులకు స్వచ్ఛమైన గాలి, నీరు, పచ్చదనం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టిందన్నారు. ప్రభుత్వ హామీ పట్ల అసోసియేషన్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ సమావేశంలో మూసీ ప్రాజెక్ట్ ఎండి ఈ.వి. నర్సింహారెడ్డి, జాయింట్ ఎండి గౌతమి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి మరియు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Post Views: 2








