Mahaa Daily Exclusive

  సింగరేణి ఇంచార్జ్ ఎంపీడీవోగా మల్లెల రవీంద్ర ప్రసాద్

Share

కారేపల్లి, మహా : సింగరేణి మండల ఎంపీడీవో గా ఎంపీవో మల్లెల రవీంద్ర ప్రసాద్ మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి ఎంపీడీవోగా పని చేసిన పీ.శ్రీనివాస్ పదోన్నతి పొంది ఖమ్మం జిల్లా డిప్యూటీ సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం సింగరేణి మండల ఎంపీవోగా సేవలందిస్తున్న మల్లెల రవీంద్ర ప్రసాద్‌కు ఇంచార్జ్ ఎంపీడీవో బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మల్లెల రవీంద్ర ప్రసాద్ కార్యాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో సమావేశమై మండల అభివఅద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే దిశగా కఅషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా స్థానిక ప్రజాప్రతినిధులు, తోటి అధికారులు, సిబ్బందిపుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.