Mahaa Daily Exclusive

  ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా భరత్ భూషణ్…

Share

  • ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా భరత్ భూషణ్
  • వైస్ ఛైర్మన్‌గా ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్

అమరావతి, మహా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలకమండలిని నియమించింది. సంస్థ ఛైర్మన్‌గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ పంపిణీదారుడు పి. భరత్ భూషణ్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వైస్ ఛైర్మన్‌గా ప్రముఖ సినీ దర్శకుడు చిక్కాల మెహర్ రమేష్ కుమార్ (మెహర్ రమేష్) నియమితులయ్యారు. గత రెండేళ్లుగా ఖాళీగా ఉన్న ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని భర్తీ చేయడంతో పాటు, 14 మందిని డైరెక్టర్లుగా నియమించారు. నూతనంగా నియమితులైన బోర్డు డైరెక్టర్ల జాబితాలో నటులు సుమన్, ఎస్. శివాజీ, రచయిత బుర్ర సాయిమాధవ్, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, వివేక్ కూచిభొట్ల వంటి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఉన్నారు.