Mahaa Daily Exclusive

  ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం: లబ్ధిదారులకు పట్టువస్త్రాలు బహూకరించిన ఎంపీ చామల

Share

ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం: లబ్ధిదారులకు పట్టువస్త్రాలు బహూకరించిన ఎంపీ చామల

భువనగిరి నియోజకవర్గ పరిధిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

ఈ శుభకార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి శాసనసభ సభ్యులు శ్రీ కుంభ అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నూతన గృహాల్లోకి అడుగుపెడుతున్న లబ్ధిదారులకు ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు సాంప్రదాయబద్ధంగా లబ్ధిదారులకు పట్టు వస్త్రాలను సమర్పించారు.

పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడం, వారి ముఖాల్లో ఆనందాన్ని చూడటం అత్యంత తృప్తినిచ్చే విషయం. నూతన ఇందిరమ్మ గృహాల్లోకి అడుగుపెడుతున్న కుటుంబాలన్నింటికీ శుభం జరగాలని శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి, భువనగిరి మున్సిపల్ చైర్మన్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.