మంచిర్యాల, మహా : అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ పై సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆ సంస్థ యాజమాన్యం ఆదివారం ప్రకటించింది. శనివారం సోషల్ మీడియా వేదికగా కొంతమంది పిరికిపందలు అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థపై దుష్ప్రచారం, బ్లాక్ మైలింగ్ లకు దిగుతున్నారని వీరిని త్వరలో గుర్తించి వారిపై పరువు నష్టం దావా వేస్తామని ఆ సంస్థ అధినేత శ్రీధర్ హెచ్చరించారు.
అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ప్రజల ఆదరాభిమానాలతో వివిధ జిల్లాల వ్యాప్తంగా వృద్ధి చెందుతుందని అన్నారు. మా సంస్థ అభివృద్ధిని ఓర్చుకోలేని కొంతమంది బట్ట బాజీలు పనిగట్టుకొని దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రజల నమ్మకమే మా బలమని ఆయన వాక్యానించారు. ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని మా సంస్థ లో పెట్టుబడి పెడితే వారిని రక్షించవలసిన అవసరం తమ సంస్థకు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.








