మెల్‌బోర్న్: బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో త్వరలో చేపట్టనున్న డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మెల్‌బోర్న్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ, డిజిటల్ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఘన విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల సిడ్నీ మరియు కాన్బెర్రాలో నిర్వహించిన సమావేశాలకు విశేష స్పందన లభించిందని, అక్కడి కార్యకర్తలు మరియు తెలంగాణ అభిమానుల నుంచి అపూర్వమైన ఆదరణ లభించడం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని తెలిపారు.
బీ ఆర్ ఎస్ నాయకుడు సాయిరామ్ ఉప్పు మాట్లాడుతూబీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ప్రతిపాదిత ఆస్ట్రేలియా పర్యటన కోసం ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, ఈ పర్యటన చారిత్రాత్మకంగా నిలిచేలా ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. కొత్త కమిటీల ఏర్పాటు విషయమై కూడా సమావేశంలో చర్చించారు. వినయ్ సన్నీ చెలుపాటి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి చురుకుగా పనిచేయాలని ఆయన ఆహ్వానించారు.
ఈ సమావేశంలో ముఖ్య నాయకులు ఉదయ్ సింహారెడ్డి, విశ్వామిత్ర మంత్రిప్రగడ, సూర్యరావు, సతీష్ పులిపాక, రాకేష్, నితీష్ గౌడ్ , సాయిపృథ్వి , వినోద్ కత్తుల, సునీల్ యాదవ్, రాకేష్ యాదవ్, భాను తేజ్, అజయ్, వివాన్, సంజు రెడ్డి, సుమంత్ , ఉదయ్ రెడ్డి, వెంకట్ రమణ , రామ్ సాయి, సుమంత్, సాయి కృష్ణ, సాయి వంశీ, సాయి కిరణ్,అశ్రీత్, నరేందర్ రెడ్డి, శివ హైదరాబాద్ , తిరుపతి పెద్ది తదితరులు పాల్గొని డిజిటల్ సభ్యత్వ కార్యక్రమం విజయవంతానికి తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు.








