- నియోజకవర్గంలో ఫోర్ లైన్ రోడ్లకు శంకుస్థాపనలు
- అభివృద్ధి పథంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
- జిల్లా అధికార ప్రతినిధి బైరీక రమాకాంత్ రెడ్డి
ఇబ్రహీంపట్నం జూలై 6 మహా:
ప్రజా పాలన ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఎమ్మెల్యే రంగారెడ్డి సహకారంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని రమాకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బైరీక రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ… ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర మంత్రులచే 338 కోట్ల వ్యయంతో ఫోర్ లైన్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఏర్పడిన వాటి నుంచి స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి వందల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరుగుతుందని ప్రజల సంక్షేమం కోసం నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం జరిగింది అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో ఎమ్మెల్యే రంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తూ అమలు చేయడం జరుగుతుందని కొనియాడారు. మంగళవారం ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలలో రహదారులను తీర్చిదిద్దేందుకు 338 కోట్ల నిధులతో, రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, తొర్రూరు గ్రామంలో ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డితో కలిసి నాలుగు లైన్ల వెడల్పు రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, హాజరు కానున్న సందర్భంగా జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పాల్గొనాలని రమాకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.








