Mahaa Daily Exclusive

  ఖైరతాబాద్ దూద్ ఖానా బస్తీలో మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) “సమస్యలపై సమరం” పర్యటన: అధికారులకు కీలక ఆదేశాలు!

Share

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు దూద్ ఖానా బస్తీలో పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానికులు బస్తీలో గత కొంతకాలంగా వీధి దీపాలు వెలగకపోవడం, మంచినీటి సరఫరా 2&3 రోజులకు ఒకసారి మరియు సమయపాలన లేకుండా వస్తుండడం , అలాగే సన్నధారతో కొద్దిసేపు మాత్రమే నీరు రావడం వంటి సమస్యలను MGR గారి దృష్టికి తీసుకువచ్చారు.

ప్రజల సమస్యలపై వెంటనే స్పందించిన MGR గారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బస్తీలో వెలగని అన్ని వీధి దీపాలను అత్యవసరంగా సరిచేయాలని ఆదేశించారు. అలాగే మంచినీటి సమస్యను కూడా రెండు మూడు రోజుల్లో పరిష్కరిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో యాది లక్ష్మి, విజయ్ చందర్, మొయినుద్దీన్, అబ్బాస్, బలరాం, కృష్ణవేణి, మంజుల, శ్రీనివాస్ నాయుడు, నరసంహా, సారంగా పాణి మరియు తదితరులు పాల్గొన్నారు.