Mahaa Daily Exclusive

  చెరువుల అనుసంధానం కోసం ఎమ్మెల్యేకు వినతి.. ప్రణాళిక పనులను ఎమ్మెల్యేకు వివరించిన కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమలరావు..

Share

కారేపల్లి,మహా:
రైతుల పంట సాగునీటి అవసరాల కోసం చెరువుల అనుసంధానం చేపట్టాలని చీమలవారి గూడెం కట్టు నుంచి గేట్ కారేపల్లి చెరువుకు సాగునీరు అందేలా ప్రణాళికలను రూపొందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపూడి తిరుమలరావు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ను కోరారు.చీమలవారి గూడెం కట్టు నుంచి అనంతారం,గేట్ కారేపల్లి చెరువులకు సాగునీరు అందేలా చేపట్టాల్సిన నీటి ప్రణాళికను కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమలరావు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు వివరించారు.ఈ ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా,చెరువులకు నీరు అందించి వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం కల్పించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.అనంతరం రైతుల సంక్షేమమే లక్ష్యంగా సాగునీటి సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని గుడిపూడి తిరుమలరావు స్పష్టం చేశారు.