Mahaa Daily Exclusive

  హర్ ఘర్ తిరంగా’తో ప్రతి ఇంటా దేశభక్తి చాటాలి..!తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసిన రాoచందర్ రావు

Share

  • హర్ ఘర్ తిరంగా’తో
  • ప్రతి ఇంటా దేశభక్తి చాటాలి
  • బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
  • తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసిన రాoచందర్ రావు
  • ఆగస్టు 14న ట్యాంక్ బండ్ దగ్గర భారీ ‘తిరంగా యాత్ర’
  • పార్టీలకతీతంగా ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి

హైదరాబాద్, మహా : ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాoచందర్ రావు కోరారు. రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అందులో భాగంగానే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో పాల్గొని, తన ఊరిలో, తన గల్లీలోని యువతతో కలిసి ఆయన తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసినట్లు తెలిపారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఇళ్లపై జెండాలు ఎగురవేయాలని కోరారు.

అలాగే ఆగస్టు 14న హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర చాలా పెద్ద ఎత్తున ‘తిరంగా యాత్ర’ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ యాత్ర ఏ ఒక్క పార్టీకో, రాజకీయాలకో సంబంధించింది కాదని… మన భారతదేశ ఐక్యతను, శక్తిని ప్రపంచానికి చాటిచెప్పడానికి, ‘వికసిత భారత్’ సంకల్పంతో చేపడుతున్న యాత్ర అని చెప్పారు. కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ కుల, మత, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి, దేశం కోసం ఈ తిరంగా యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.