- హెచ్‌ఐవి పై ప్రజలకు అవగాహన కల్పించాలి
- వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
- హెచ్‌ఐవి ప్రభావిత పిల్లలకు పోషణ కిట్లు పంపిణీ చేసిన కలెక్టర్
వరంగల్, మహా ;
హెచ్‌ఐవి/ఎయిడ్స్ నివారణ, నియంత్రణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వరంగల్ జిల్లాలో రెండు నెలల ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్‌ను బుధవారం ప్రారంభించారు.
ఎంజీఎం హాస్పిటల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
హెచ్‌ఐ వి వ్యాప్తి మార్గాలు, నివారణ పద్ధతులు, ముందస్తు పరీక్షలు, చికిత్స సేవల పై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు డీఏపీసీయూ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
క్యాంపెయిన్‌లో భాగంగా 200 గ్రామాలు, 200 పాఠశాలలు, 50 కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారని, ఎంపిక చేసిన ప్రాంతాల్లో 4 వేల ఇళ్లలో ఇంటింటి ప్రచారం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక అవగాహన శిబిరాలు, 100 బైక్‌లతో ప్రజా అవగాహన ర్యాలీ చేపట్టనున్నారు. బ్రేక్ ఫ్రీ యాప్ ద్వారా డిజిటల్ రిస్క్ అసెస్‌మెంట్, హెచ్‌ఐవి పరీక్షలు, కౌన్సెలింగ్ సేవల పై అవగాహన కల్పించనున్నారు.
కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఐవి ప్రభావిత పిల్లలకు కలెక్టర్ పోషణ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం హెచ్‌ఐవి/ఎయిడ్స్ నివారణ, నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా. బి. రాజా రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ డా. రామ్ కుమార్ రెడ్డి, వైద్యాధికారులు, డీఏపీసీయూ సిబ్బంది, ఎన్‌జీఓ ప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.








