వరంగల్, బ్యూరో మహా ;
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లోని ప్రతీ సభ్యుడి సంక్షేమమే తమ కమిటీ ధ్యేయమని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తూ మృతిచెందిన క్లబ్ సభ్యుడు, దివంగత డెస్క్ జర్నలిస్ట్ రబ్బానిపాషా కుటుంబానికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 10.57 లక్షలు చెక్కును అందించేందుకు క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అధ్యక్షులు వేముల నాగరాజు సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ అందించిన ఘనత గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కు, టీయూడబ్ల్యూజే-ఐజేయూ యూనియన్ కే దక్కిందని అన్నారు. సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు చేయించిన భీమా , ఒక కుటుంబానికి ఆసరాగా నిలవటం గొప్ప విషయం అని తెలిపారు. గత ఏడాది సభ్యులకు చేసిన భీమాను ఈ ఏడాది కూడా రెన్యూవల్ చేయించేందుకు తమ కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అనంతరం దివంగత జర్నలిస్ట్ రబ్బానిపాషా కుటుంబసభ్యులకు భీమా చెక్కును యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, క్లబ్ కమిటీ, యూనియన్ల బాధ్యులు, సీనియర్ జర్నలిస్టులతో కలసి అందించారు. రబ్బాని పాషా కుటుంబానికి క్లబ్ అండగా నిలుస్తుందని వారికి ఇన్సూరెన్స్ పాలసీ కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ
కార్యక్రమంలో ప్రెస్ క్లబ్
కార్యదర్శి బొల్లారం సదయ్య
కోశాధికారి బొళ్ల అమర్,
ఉపాధ్యక్షులు గోకారపు శ్యాం కుమార్,
బొడిగె శ్రీను, అల్లం రాజేష్ వర్మ,
యంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీలు, సంపేట సుధాకర్, పెద్దపల్లి వరప్రసాద్, పోడిచెట్టి విష్ణువర్ధన్,
ఈసీ సభ్యులు, వీరగోని హరీష్, జనగాని ఆంజనేయులు, ఎండి నయీంపాషా, కమటం వేణుగోపాల్, నన్నపనేని భరత్ కుమార్, మంచాల రాజు, బలువారి విజయరాజ్,
టీయూడ్ల్యూజే-ఐజేయూ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతలు గాడిపెల్లి మధు, నేతలు పీవీ మదన్ మోహన్, సంగోజు రవి, వల్లాల వెంకటరమణ, కంకణాల సంతోష్, గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, సోమనర్సయ్య, పిన్నా శివకుమార్, సాక్షి ఎడిషన్ ఇంచార్జ్ వర్ధెల్లి లింగయ్య, ఉర్దూ జర్నలిస్టుల అసోసియేషన్ బాధ్యులు గుల్షన్, సాజీద్ పాషా, సయీద్, నయీం, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ డీఎం సతీష్, ఏడీఎం సంతోష్, సందీప్, వర్థినేని లక్ష్మణ్ రావు, తదితరులు పాల్గొన్నారు.








