Mahaa Daily Exclusive

  బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై హర్షం..! సంబరాలు జరుపుకున్న కూటమి నేతలు..

Share

ఏలూరు జిల్లాచింతలపూడి, మహా : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం క్యాబినెట్‌లో ఆమోదం తెలపడం హర్షణీయమని చింతలపూడి మండల టీడీపీ అధ్యక్షుడు చింతం విష్ణు అన్నారు.
బుధవారం చింతలపూడి మినీ బస్టాండ్ వద్ద కూటమి పార్టీలకు చెందిన బీసీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏలూరుఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా చింతం విష్ణు మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కూటమి బీసీ నేతలు తాటి అప్పారావు, కొమ్మరాజు సత్యనారాయణ, యువరాజు, పులిపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Latest