Mahaa Daily Exclusive

  భార్యను హతమార్చిన భర్త అరెస్ట్, రిమాండ్.

Share

వరంగల్, క్రైమ్ మహా ;

2023 సంవత్సరంలో భార్యను హతమార్చిన కేసులో నిందితుడైన భర్త కుమ్మరి సుధాకర్, ( క్రైమ్ నెంబర్ 129/2023, పిఎస్ ఇంత జార్గంజ్) అనే నిందితుడు 2024 నుండి కోర్టుకు హాజరు కాకుండా, కోర్టు శిక్షను తప్పించుకోవాలనే ఉద్దేశంతో తప్పించుకుని తిరుగుతూ ఉండగా, కోర్టు నిందితుడు సుధాకర్ పై ఎన్ బి డబ్ల్యూ జారీ చేయగా సదరు సుధాకర్ ను పట్టుకోవడానికి ఇంత జార్గంజ్ ఇన్స్పెక్టర్ సుకూర్ నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి అందులో సబ్ ఇన్స్పెక్టర్లు, క్రైమ్ కానిస్టేబుల్స్ సదరు సుధాకర్ ఉంటున్న ప్రదేశాన్ని టెక్నాలజీతో చాకచక్యంగా తెలుసుకొని తేదీ 19 8 2026 నిందితుడైన సుధాకర్ ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరుచగా కోర్టు తీర్పుతో ఆ నిందితుడిని రిమాండ్ కు తరలించడం జరిగిందని ఇన్స్పెక్టర్ ఎంఏ సుకూర్ మీడియాకు తెలిపారు.

Latest