గుంటూరు: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి అసెంబ్లీలో గళమెత్తారు. ప్రతి జిల్లాలో అక్రిడిటేషన్ కలిగిన అర్హత ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని, వారి సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆమె అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల చిరకాల డిమాండ్ అయిన ఇళ్ల స్థలాల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి, జర్నలిస్టుల తరఫున గళమెత్తిన ఎమ్మెల్యే గల్లా మాధవికి వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆమె చేసిన ఈ ప్రయత్నాన్ని సంఘాల నాయకులు అభినందించారు.








