Mahaa Daily Exclusive

  డైట్ మైదానంలో ద‌స‌రా వేడుక‌ల ఆరంభం …

Share

  • డైట్ మైదానంలో ద‌స‌రా వేడుక‌ల ఆరంభం
  • ఉత్స‌వాల‌కు కంది మౌనాశ్రీ‌నివాస రెడ్డి భూమి పూజ‌
  • స‌నాత‌న హిందూ ఉత్స‌వ స‌మితి ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మం

 

 

ఆదిలాబాద్ : ప్ర‌జ‌లంద‌రిపై దుర్గ‌మ్మ ఆశీస్సులు ఉండాల‌ని అంద‌రూ సుఖ శాంతుల‌తో వ‌ర్ధిల్లాల‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి స‌తీమ‌ణి కంది మౌనా శ్రీ‌నివాస రెడ్డి ఆకాంక్షించారు. స‌నాత‌న హిందూ ఉత్స‌వ స‌మితి ఆధ్వ‌ర్యంలో ఆదివారం స్థానిక డైట్ కాలేజీ మైదానంలో బ‌తుక‌మ్మ ,ద‌స‌రా వేడుక‌ల సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ఆమె ముఖ్య అతిథిగా హాజ‌రై వేడుక‌లకు స‌మితి స‌భ్యుల‌తో క‌లిసి భూమి పూజ చేసారు.అ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ద‌స‌రా ,మ‌హిళ‌ల‌కు బ‌తుక‌మ్మ పండ‌గ శుభాకాంక్ష‌లు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజ‌యానికి గుర్తుగా విజ‌య‌ద‌శ‌మి నాడు రావ‌ణ ద‌హ‌నం చేప‌డ‌తామ‌ని అన్నారు.క్రమం త‌ప్ప‌కుండా గ‌త ప‌ధ్నాలుగేళ్లుగా ఇక్క‌డ రావ‌ణ‌ద‌హ‌న కార్య‌క్ర‌మం చేప‌డుతూ అదే ఆన‌వాయితీని ఈ సంవ‌త్స‌రం కూడా కొన‌సాగిస్తోన్న స‌మితి సేవ‌ల‌ను ఆమె అభినందించారు. స‌నాత‌న హిందూ ఉత్స‌వ స‌మితి హిందూ సంస్కృతీ సాంప్ర‌దాయాల‌ను కాపాడుతూ ప‌ట్ట‌ణంలో స‌మాజ హితం కోసం అనేక హిందూ పండ‌గ‌ల ఉత్స‌వాలు నిర్వ‌హిస్తోంద‌న్నారు. ఇలాగే మున్ముందు మ‌రిన్ని ఉత్స‌వాలు చేప‌ట్టాల‌ని ఆకాంక్షించారు. ప్ర‌జ‌లంద‌రూ ద‌స‌రా బ‌తుక‌మ్మ పండ‌గ‌ల‌ను ఆనందోత్స‌హాల‌తో జ‌రుపుకోవాలని కంది మౌనా శ్రీ‌నివాస రెడ్డి అభిల‌షించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆత్మ‌క‌మిటీ చైర్మ‌న్ గిమ్మ సంతోష్ రావు, నాయ‌కులు బండారి స‌తీష్ ,ద‌ర్శ‌నా అశోక్ , డేరా కృష్ణా రెడ్డి ,న‌ర్సింలు, వేద పండితులు సంతోష్ శర్మ,స‌నాత‌న హిందూ ఉత్స‌వ స‌మితి అధ్య‌క్షులు ప్ర‌మోద్ ఖ‌త్రి, , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్ట‌ర్ క్రాంతి , డాక్ట‌ర్ రజిత, స‌మితి గౌరవ అధ్యక్షులు కందుల రవీందర్, ప్రధాన కార్యదర్శి రేణికుంట రవీందర్, కోశాధికారి సంతోష్ అగర్వాల్,కార్యనిర్వహక అధ్యక్షులు దశరథ్ , ఉపాధ్య‌క్షులు సమనపల్లి నర్సింలు , సురేష్ పౌడవాల్ , మహిపాల్ , సుభాష్ ఉరడే ,తిరుపతి రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.