Mahaa Daily Exclusive

  ఘనంగా కలెక్టర్ జన్మదిన వేడుకలు 

Share

ఆదిలాబాద్ మ‌హా : ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా జన్మదిన వేడుకలను మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష స‌తీష్ తో పాటు జిల్లా అధికారులు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారి సమక్షంలో కలెక్టర్ కేక్‌ కట్‌ చేసి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ చూపిన ఆప్యాయత, అభిమానానికి ధన్యవాదాలు తెలియజేశారు.జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, క్యాంపు కార్యాలయం సిసి లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.