Mahaa Daily Exclusive

  జాతరమ్మ జాతరో… కోటమైసమ్మ జాతరకు జన సందడి..!

Share

  • జాతరమ్మ జాతరో…
  • కోటమైసమ్మ జాతరకు జన సందడి
  • అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

కారేపల్లి, మహా :కోటమైసమ్మ జాతర జన సందండిగా మారింది. దసరా సందర్బంగా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మంగళవారం జాతర ఘనంగా ప్రారంభమైంది. ఐదు రోజులు పాటు రాత్రి పగలు నిరంతరాయం సాగే ఈ జాతర కు జనం తరలివస్తున్నారు. రెండోవ రోజు బుధవారం అమ్మవారిని దర్శనానికి జనం క్యూ కట్టారు. ఆలయ వద్ద వాహన పూజకు విశేష ప్రాముఖ్యత ఉండటంతో భక్తులు వాహనలకు పూజ చేయించుకోవటానికి అధికంగా పోటీలు పడ్డారు. వాహన పూజకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో దేవదాయశాఖ దానికి అనుగుణంగా ఏర్పాట్లను చేసింది. వాహన పూజకు ప్రత్యేకంగా అర్చకులను నియమించారు. జాతరలో ఏర్పాటు చేసిన వినోద సాధనాలైన టవర్ రైడర్, రేంజర్ రైడర్, రేంజర్, జాయింట్ విల్స్, కొలంబో, సోలంబో, క్రాస్ వీల్, డ్రాగన్ ట్రైన్ వంటి వాటిలో విహరిస్తూ యువత కేరింతలు కొట్టారు. జాతరలో బూరలలు ఊదుతూ, యువత ఈలల శబ్దంతో జాతర ప్రాంగణం సందండిగా మారింది. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రస్తూ వాహనాలను పోలంపల్లి క్రాస్ రోడ్‌లోని కోటమైసమ్మ తల్లి ఆర్చి వద్దనే వాహనాలను నిలిపి వేస్తున్నారు. అక్కడి నుండి భక్తులు నడకనే రావాలని కోరుతున్నారు. జాతరలో ఆవాంచనీయ ఘటనలు జరగకుండా 24 గంటలకు ప్రత్యేక పోలీసు బంధోబస్తు నిర్వహిస్తున్నట్లు సింగరేణి సీఐ ఎన్ సాగర్, ఎస్సై బైరు గోపిలు తెలిపారు. జాతరలో అనుమానిత వ్యక్తుల సమాచారంను వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. జాతరలో వైద్యశాఖ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి భక్తులకు నిరంతరం వైద్య సేవలందిస్తుంది.

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

దసరా జాతర సందర్భంగా కోటమైసమ్మ తల్లిని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ దంపతులు దర్శించుకున్నారు. కేరళ అడిషనల్ డీజీపి లక్ష్మన్ నాయక్, సింగరేణి కాలరీస్ ఇల్లందుఏరియా జీఎం వీసం కృష్ణయ్య, ఇల్లందు మాజీ మున్సిపాల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు లు కుటుంభ సభ్యులతో కలిసి కోటమైసమ్మ ఆమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ఆధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం ఫలికారు. ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కల్గకుండా ఆలయ చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభి రామారావు, ఈవో కే.వెంకటయ్య లు దగ్గరుండి జాతరను పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలను ప్రధాన అర్చకులు కొత్తలంక కైలాస శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు నిర్వహిస్తున్నారు.