Mahaa Daily Exclusive

  వలస కూలి పై వ్యక్తి దాడి..! తీవ్రగాయాలైన కూలిని ఖమ్మం అసుపత్రికి తరలింపు..

Share

  • వలస కూలి పై వ్యక్తి దాడి
  • తీవ్రగాయాలైన కూలిని ఖమ్మం అసుపత్రికి తరలింపు
  • దాడి చేసిన వ్యక్తి పై పోలీస్ కఠిన చర్య తీసుకోవాలి.. వ్యకాస డిమాండ్

కారేపల్లి, మహ: ఉపాధి కోసం ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన 19 ఏళ్ల వలస కూలీపై వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన సింగరేణి మండలం మాణిక్యారంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..బతుకు దెరువు కోసం కొందరు యువకులు ఇతర రాష్ట్రం నుంచి వచ్చి మాణిక్యారం ప్రాంతంలో కూలి పని చేసుకుంటున్నారు. వలస కూలీ రాజు (19) అనే యువకుడు మాణిక్యారంలో ఓ వ్యక్తి వద్ద కూలీ పనులకు కుదిరాడు. నెల రోజుల క్రింతం వ్యక్తి వద్ద నుండి పని మానివేసి మరో రైతు వద్ద పనికి కుదిరినాడు. దీనిని మనస్సులో పెట్టుకున్న సదరు వ్యక్తి బుధవారం వలస కూలి రాజుపై దాడి చేశారు. ఈ ఘటనలో రాజు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని ను స్థానికులు కారేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా పోలీస్ వారు వివరాలు సేకరించి అతనిని కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్ధితి తీవ్రంగా ఉండటంతో అతనిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు.
దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలనీ పలు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు