- పట్టభద్ర ఎన్నికల ప్రచారంలో మన్నెగోవర్ధన్ రెడ్డి
- ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ దే గెలుపన్న ఎంజీఆర్
హైదరాబాద్, మహా :
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్ లో సోమవారం అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మన్నె గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుగానే నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.








