Mahaa Daily Exclusive

  జాతీయ స్థాయిలో వరంగల్ కు అవార్డు దక్కడం గర్వకారణం..

Share

  • జాతీయ స్థాయిలో వరంగల్ కు అవార్డు దక్కడం గర్వకారణం
  • జిల్లా కలెక్టర్, బల్దియా ప్రత్యేక అధికారి, కూడా వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి, కమిషనర్ వెంకన్న, అధికారులకు అభినందనలు
  • కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి

హనుమకొండ, మహా ;

జాతీయ స్థాయిలో నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో వరంగల్ నగరానికి అరుదైన గుర్తింపు లభించి అవార్డు రావడం గర్వకారణం అని కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి అన్నారు.
సోమవారం హనుమకొండ లోని కుడా కార్యాలయంలో వరంగల్ నగరానికి జాతీయ అవార్డు రావడం పట్ల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి, జీడబ్ల్యూఎంసి కమిషనర్ వెంకన్న, కుడా సీపీవో అజిత్ రెడ్డి, తదితరులను కుడా ఛైర్ పర్సన్ అభినందించారు.
ఈ సందర్భంగా కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో శనివారం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ స్థాయి అర్బన్ కాన్‌క్లేవ్‌లో నాన్‌ మోటరైజ్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విభాగంలో వరంగల్ నగరానికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ విభాగంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీలో వరంగల్, చెన్నై నగరాలకు రావడం గొప్పవిషయం అన్నారు.
ఈ అవార్డు వరంగల్‌ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)కు లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

వరంగల్ నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ అవార్డు వరంగల్‌ నగరంలో పర్యావరణహిత పట్టణాభివృద్ధికి మరింత ప్రోత్సాహాన్నిస్తుందని కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కుడా ఈఈ భీమ్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.