కారేపల్లి, మహ : అడవి జంతువుల వేట కోసం పామాయిల్ తోటలో విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసిన నలుగురిపై ఫారెస్ట్ అధికారులు మంగళవారం కేసు నమోదు చేశారు. మాదారం పరిసర గ్రామాలకు చెందిన పబ్బుల రాములు, భూక్యా రఘు, రెడ్డిబోయిన వెంకన్న, ఎల్లిబోయిన నాగేశ్వరావు లు అప్పాయిగూడెం పరిసర ప్రాంతం పాలిక కోటయ్య పామ్ ఆయిల్ తోటలో అటవీ జంతువుల కోసం ఏర్పాటు చేసిన అక్రమ విద్యుత్ వైర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆ సమయంలో కరెంటు పదే పదే ట్రిప్ అవుతుండటంతో విద్యుత్ శాఖ వారి సహకారం తో ఫారెస్ట్ అధికారులు విద్యుత్ ఉచ్చులను గుర్తించారు. అడవి జంతువుల కోసం విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి విచారణ అనంతరం 4 గురి పై కేసు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పరచినట్లు ఎఫ్ఆర్వో ఆర్. శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఏ. రవి కుమార్, ఎఫ్బీవో బీ.రవి తదితరులు పాల్గొన్నారు.








