Mahaa Daily Exclusive

  పోలీసు అమరుల త్యాగాలు వెల కట్టలేనివి…

Share

  • పోలీసు అమరుల త్యాగాలు వెల కట్టలేనివి
  • పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత

ఎంజీఎం, మహా

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా వరంగల్ సబ్ డివిజన్, క్రైమ్ డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఎంజీఎం ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఐఎంఏ హాల్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెంట్రల్ జోన్ డిసిపి దారా కవిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఎసిపి, క్రైమ్ ఎసిపి, మట్వాడ, ఇంతేజార్‌గంజ్, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు ఎంఏ సుకూర్, ఎన్ కరుణాకర్ రావు, కర్నె స్వామి, సబ్ ఇన్స్పెక్టర్లు, క్రైమ్ విభాగపు సిబ్బంది తో పాటు వరంగల్ డివిజన్ యూత్ పెద్ద సంఖ్యలో పాల్గొని దాదాపు 70 యూనిట్ల రక్తాన్ని ఎంజిఎం బ్లడ్ బ్యాంక్‌కు విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా ఎంజిఎం బ్లడ్ బ్యాంక్ ఇన్-ఛార్జ్ డాక్టర్ సంయుక్త, వారి వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పోలీస్
అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా డిసిపి సెంట్రల్ జోన్ కవిత మాట్లాడుతూ
సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల ప్రాణ ఆస్తుల రక్షణకు తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు వెలకట్టలేనివని వారి త్యాగనిరతిని స్మరించుకుంటూ, సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది, ముఖ్యంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వరంగల్ యువతకు అభినందనలు తెలియజేశారు.