Mahaa Daily Exclusive

  కరువును చంద్రబాబు బాగా మేనేజ్‌ చేశారు: మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసలు

Share

 

హైదరాబాద్, మహా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశంసలు కురిపించారు. కరవును చంద్రబాబు బాగా మేనేజ్‌ చేశారని కొనియాడారు. ఈ విషయంలో చంద్రబాబును ప్రత్యేకంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో తెలంగాణ కంటే ఎక్కువ కరవు ఉందని చెప్పుకొచ్చారు. కర్ణాటక, ఏపీలో లేని కరవు తెలంగాణకు ఎందుకొచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ను ప్రశ్నించారు. 30 శాతం కమీషన్‌ సర్కార్‌ అని రాజ్‌గోపాల్‌రెడ్డే అన్నారని చెప్పారు. కొండా సురేఖ ఏం చేప్పారో తాను ఇంకా చూడలేదని అన్నారు. తనకు ఇంకా క్షమాపణ చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు.