- నగరంలో ఆహార తయారీ కేంద్రాల పై టీజీ సేఫ్ కొరడా
- గ్రేటర్ వరంగల్ నగరంలో ఫుడ్ సేఫ్టీ ఆకస్మిక తనిఖీలు
- 9 ఆహార తయారీ కేంద్రాల లైసెన్సు రద్దు
- వ్యాపారాల నిలిపివేత, షో కాస్ నోటీసులు ఇంప్రూవ్మెంట్ నోటీసుల జారీ
వరంగల్, హనుమకొండ మహా ;
టీజీ సేఫ్ (తెలంగాణ స్టేట్ ఫుడ్ సేఫ్టీ) కమిషనర్ అవినాష్ మహంతి ఐపీఎస్ ఆదేశాల మేరకు, వరంగల్, హన్మకొండ జిల్లా పరిధిలోని పలు మిఠాయి తయారీ కేంద్రాలు ఆయిల్ మిల్లులు, ముడి పదార్థాల ప్రాసెసింగ్ యూనిట్ల పై ఆహార పరిరక్షణ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి పర్యవేక్షణలో మొత్తం 10 ప్రత్యేక బృందాలు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నాయి.
50 మంది సిబ్బంది పాల్గొన్నారు.
ఈ తనిఖీల్లో భాగంగా హన్మకొండ, వరంగల్ పరిధిలోని పలు ప్రముఖ ఆహార తయారీ కేంద్రాలలో, స్పైసెస్ తయారీ కేంద్రాలు, కొన్ని ఆయిల్ మిల్లుల తయారీ కేంద్రాలు, మిఠాయి తయారీ కేంద్రాలు, అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాలు, సోంపు తయారీ, ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాల మీద ఏక కాలంలో దాడులు చేయడం జరిగింది
తయారీ కేంద్రాలలో తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలు, నాణ్యతా లోపాలు తో పాటు అపరిశుభ్ర వాతావరణాన్ని అధికారులు గుర్తించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా వ్యవహరిస్తున్న సదరు సంస్థలపై కఠిన చర్యలకు సిఫార్సు చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ తో పాటు లైసెన్స్ సస్పెండ్ చేస్తూ పలు యూనిట్లను మూసివేయడం జరిగింది.
*తనిఖీల్లో కనుగొన్న ప్రధాన నిబంధనల ఉల్లంఘనలు*
ఆహారంలో నిషేధిత పదార్థాల వాడకం ఆరోగ్యానికి హానికరంగా మారాయి.
స్వీట్ల తయారీలో ఫ్లేవర్ కోసం ముఖానికి రాసుకునే ‘ఫేషియల్ రోజ్ వాటర్’ను వాడుతుండటం అధికారులు గుర్తించి షాక్ కు గురయ్యారు.
*కుళ్ళిన, గడువు ముగిసిన ముడి పదార్థాలు*
చిప్స్ తయారీ కోసం నిల్వ ఉంచిన కుళ్ళిపోయిన బంగాళాదుంపలు, బూజు పట్టిన అల్లం, తో పాటు రూ. 9,400 విలువైన గడువు ముగిసిన ఆహార పదార్థాలను గడువు ఉన్న వాటితో కలిపి ఉంచడం కనుగొన్నారు.
ఒక సోంపు తయారీ కేంద్రంలో 5045 kgs, ఐదు లక్షల 41 వేల వందల యాభై రూపాయల విలువ గల లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన , సరైనటువంటి చిరునామా వాటి వివరాలు ముద్రించకుండా అనుమానాస్పదంగా ఉన్న ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించే ముడి సరుకులను సీజ్ చేయడం జరిగింది.
మిఠాయిల తయారీకి ఉపయోగించే చక్కెర పాకంలో చనిపోయిన దోమలు తేలుతూ కనిపించాయి. అంతేకాకుండా తయారీ కేంద్రం లోపల కుక్కలు సంచరిస్తూ, పరిసరాలను అపరిశుభ్రం చేస్తూ ఉంటే అక్కడ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అపరిశుభ్రంగా పరిసరాలు ఉన్నాయి.
అత్యంత ప్రమాదకరమైన రీతిలో ఎలక్ట్రికల్ కంట్రోల్ ప్యానెల్ బోర్డుల లోపల ముడి పదార్థాలను నిల్వ ఉంచారు. విద్యుత్ బోర్డులు తెరిచి ఉండటంతో పాటు, ఫైర్ ఎక్స్స్టింగిషర్లను సరిగ్గా నిర్వహించడం లేదు.
నీటి నిల్వ ట్యాంకులు తీవ్ర అపరిశుభ్రంగా ఉండి, తయారీ కేంద్రాల పక్కనే దుర్వాసన వచ్చే ఓపెన్ డ్రైనేజీలు ఉన్నాయి. వంటగది ఫ్లోరింగ్ జిడ్డుగా, జారుడు స్వభావంతో ఉంది.
నూనె నిల్వ చేసే ట్యాంకులు, రీఫిల్లింగ్ చేసే ఇనుప టిన్లు, స్వీట్ తయారీ యంత్రాలు పూర్తిగా తుప్పు పట్టి, దుమ్ముతో నిండి ఉన్నాయి. ప్యాకేజింగ్ మెటీరియల్‌పై బ్రాండ్ పేర్లను తప్పుగా ముద్రించడమే కాకుండా, దాదాపు 80 కిలోల తప్పుడు లేబులింగ్ మెటీరియల్‌ను అధికారులు ధ్వంసం చేశారు.
ఆహార నిర్వాహకులకు ఎటువంటి ఫుడ్ సేఫ్టీ శిక్షణ లేదు. సిబ్బందికి మెడికల్ సర్టిఫికెట్లు, వాటర్ అనాలిసిస్ రిపోర్టులు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు కనీస ఆప్రాన్లు, గ్లౌజులు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు.
*లైసెన్స్‌ల రద్దు, ఇతర చర్యలు*
9 తయారీ కేంద్రాలు లైసెన్సులు సస్పెండ్ చేయబడ్డాయి, నాలుగు షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది, 1ఇంప్రూవ్మెంట్ నోటీసులని ఇవ్వడం తో పాటు ఒక సెంట్రల్ లైసెన్స్ పరిధిలోని ఒక తయారీ కేంద్రం కు సస్పెన్షన్ కొరకు సిఫార్సులు చేయడం జరిగింది. అనుమానాస్పద ఫుడ్ శాంపిళ్లను ల్యాబ్ కు తరలించడం జరిగింది.
తీవ్రమైన ఉల్లంఘనలు జరిగినట్లు ఆధారాలు లభించడంతో, ప్రజారోగ్య భద్రత దృష్ట్యా సదరు సంస్థల ఫుడ్ లైసెన్స్‌లను తక్షణమే సస్పెండ్ చేసి ప్రజల ఆరోగ్య నిమిత్తం ఆహార కేంద్రాలను మూసివేయడం జరిగింది. నాణ్యత పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపేందుకు పలు ఆహార నమూనాలను సేకరించారు.
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన లక్ష్యమని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ జ్యోతిర్మయి తెలిపారు.
హోటళ్లు, రెస్టారెంట్లు, మిఠాయి, స్పైసెస్ తయారీ కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఆహార పరిరక్షణ లైసెన్స్‌లను ప్రముఖంగా ప్రదర్శించాలని, నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై చట్టప్రకారం కఠినమైన క్రిమినల్ చర్యలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.
ఈ దాడులలో వరంగల్ జిల్లా, హనుమకొండ,భూపాలపల్లి,ములుగు, జనగాం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల ఫుడ్ ఇన్స్పెక్టర్ లతో పాటు పోలీస్ సిబ్బంది 30 మంది పాల్గొన్నారు.








