హైదరాబాద్‌లో ‘రెనైసాన్స్’ ఛారిటీ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభం
హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో VSL Visual International Art Gallery, సహాయ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘Renaissance – Charity Art Exhibition’ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ANN మీడియా గ్రూప్ CEO కంది రామచంద్రారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నిజాం వారసుడు రోనా ఖాన్, HDFC వైస్ ప్రెసిడెంట్ అనన్య, బయోడైవర్సిటీ నిపుణులు డాక్టర్ రవీందర్, కార్యక్రమ నిర్వాహకురాలు అనిత హరి, ప్రముఖ చిత్రకారుడు హరి తదితరులు పాల్గొన్నారు.
‘Art For A Cause’ నినాదంతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో చిత్రకారుడు హరి రూపొందించిన సమకాలీన చిత్రాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ద్వారా నిధులు సేకరించి అవసరమైన వారికి వీల్చైర్లు అందించాలనే ‘Mobility for Dignity’ కార్యక్రమాన్ని చేపట్టారు.
కళను సామాజిక సేవతో అనుసంధానిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయం. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ నవంబర్ 1 వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.







