Mahaa Daily Exclusive

  ర్యాపిడోలో బంగారం పార్సిల్ చోరీ…..

Share

  • ర్యాపిడోలో బంగారం పార్సిల్ చోరీ…
  • అరవై రెండు వేల విలువైన నగలతో డెలివరీ బాయ్ ఉడాయింపు

హైదరాబాద్, మహా : . బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని వివో సంస్థలో అడ్మిన్ మేనేజర్‌గా పనిచేస్తున్న దత్త ప్రసాద్ నల్లపాటి నాగోల్‌లో ఉంటున్న తన బంధువుల ఇంటికి బంగారు నగలు పంపేందుకు ర్యాపిడో బుక్ చేశారు.

బైక్‌పై వచ్చిన డెలివరీ బాయ్ గీతిమెట్టు మురళి సెక్యూరిటీ గార్డు వద్ద పార్సిల్ తీసుకున్నాడు. అందులో రూ.62,383 విలువైన బంగారు మెట్టెలు, రోజ్ గోల్డ్ పట్టీలు ఉన్నాయి. పార్సిల్ తీసుకున్న అనంతరం పెట్రోల్ ఖర్చుల కోసం మరో రూ.100 కావాలని డెలివరీ బాయ్ అడగడంతో దత్త ప్రసాద్ ఫోన్‌పే ద్వారా పంపించారు.

కొద్దిసేపటి తర్వాత రైడర్‌కు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. నాగోల్‌లోని బంధువులను సంప్రదించగా పార్సిల్ చేరలేదని తెలిసింది. తిరిగి ఫోన్ చేయగా రైడర్ తన నంబర్‌ను బ్లాక్ చేసినట్లు గుర్తించారు. కస్టమర్ కేర్‌ను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో దత్త ప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.62 వేల విలువైన బంగారు నగలతో డెలివరీ బాయ్ మాయమైన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

……