మట్టెవాడ, మహా ;
వరంగల్ నగరంలోని
వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్యాయత్నం కేసులో నిందితుడిని పోలీసులు వేగంగా స్పందించి అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
సంఘటన వివరాలు..
ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 15:20 గంటల ప్రాంతంలో మటవాడలోని కుమ్మరివాడ ప్రాంతంలో సురావు సాయికుమార్ (30) అనే వ్యక్తిపై పల్లెర్ల శ్రీకాంత్ (30) అనే కారు డ్రైవర్ పగతో దాడి చేశాడు. తన భార్య శ్రవణ్‌తో సాయికుమార్‌కు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే ఈ హత్యాయత్నానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది.
సాయికుమార్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో శ్రీకాంత్ తన వద్ద ఉన్న కూరగాయల చాకుతో సాయికుమార్ కడుపు, ఛాతీ, వీపు భాగాల్లో మొత్తం 7 సార్లు తీవ్రంగా పొడిచాడు. బాధితుడు కిందపడిపోయిన తర్వాత కూడా చనిపోలేదనే అనుమానంతో పక్కనే ఉన్న చపాతీలు చేసే రాతి బండతో సాయికుమార్ తలపై దారుణంగా బాదాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన సాయికుమార్ తల్లి హంసబాయిపై కూడా నిందితుడు దాడి చేసి అక్కడి నుండి పరారయ్యాడు.
పోలీసుల తక్షణ చర్యలు విచారణ..
సంఘటన సమాచారం అందగానే 112 డయల్ పిలుపు మేరకు బ్లూ కోల్ట్స్ సిబ్బంది, మట్టెవాడ ఎస్.ఐ బి. శ్రీనివాస్ తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన సాయికుమార్‌ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మటవాడ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నం: 632/2026, U/Sec 109(1) బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు.
నిందితుడి అరెస్ట్ & స్వాధీనం:
మట్టెవాడ ఎస్.ఐ బి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బృందం గాలింపు చర్యలు చేపట్టి, 10.11.2026 సాయంత్రం 17:45 గంటల ప్రాంతంలో పోతననగర్ క్రాస్ రోడ్స్ సమీపంలో నిందితుడైన పల్లెర్ల శ్రీకాంత్ (తండ్రి: మొగిలి, వయస్సు: 30 సంవత్సరాలు, వృత్తి: కారు డ్రైవర్, నివాసం: వేణురావు కాలనీ, మటవాడ) ని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు చెప్పిన వాంగ్మూలం ఆధారంగా పోతననగర్ స్మశానవాటిక లోని ఒక చెట్టు వద్ద దాచిన రక్తం మరకలు కలిగిన దాడికి ఉపయోగించిన చాకును పంచుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఘటనా స్థలంలో విరిగిపోయిన చపాతీ బండ ముక్కలను కూడా క్లూస్ టీమ్ సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.
కోర్టులో హాజరు:
కేసు విచారణ పూర్తి చేసి నిందితుడిని నేడు (11.11.2026) వరంగల్ 3వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపడం జరిగిందని ఇన్స్పెక్టర్ ఎన్ కరుణాకర్ రావు, సబ్-ఇన్స్పెక్టర్
బి. శ్రీనివాస్ తెలిపారు.








