- కోల్‌కతా విమానాశ్రయంలో హైజాక్ కలకలం..
- టేకాఫ్‌కు ముందు హెచ్చరిక
- ఎయిరిండియా విమానం వాష్‌రూమ్ అద్దంపై అనుమానాస్పద సందేశం..
అప్రమత్తమైన పైలట్
కోల్‌కతా, మహా : కోల్‌కతా విమానాశ్రయంలో బుధవారం ఉదయం భద్రతాపరమైన కలకలం చోటుచేసుకుంది. ముంబయికి బయలుదేరాల్సిన ఎయిరిండియా విమానంలో హైజాక్ హెచ్చరిక కలకలం రేపింది. విమానం టేకాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విమానంలోని వాష్‌రూమ్‌లో ఉన్న అద్దంపై విమానాన్ని హైజాక్ చేసే అవకాశం ఉందనే అర్థం వచ్చేలా ఓ సందేశం రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు.
ఏటీసీకి సమాచారం
విమానం టేకాఫ్ కావడానికి కొన్ని క్షణాల ముందు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమాన భద్రతకు సంబంధించిన అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందేశం ఎవరు రాశారు? దాని వెనుక ఉద్దేశం ఏమిటి? అనే విషయాలపై తదుపరి విచారణ వివరాలు తెలియాల్సి ఉంది.







