Mahaa Daily Exclusive

  రైతుభరోసా సొమ్ము నేటి నుంచి బ్యాంకుల్లో తీసుకోవచ్చు: తుమ్మల

Share

ఈ ఏడాది రైతుభరోసా కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రెండు విడతలుగా రూ.12 వేలు ఇస్తామని పేర్కొన్నారు. ఆదివారం మల్లేపల్లి గ్రామసభలో మంత్రి మాట్లాడారు. రైతులకు యాసంగికి పెట్టుబడి సాయం, కూలీలకు రూ.6 వేలు ఆదివారం అర్ధరాత్రి నుంచే ఖాతాల్లో పడతాయని, సోమవారం నుంచి బ్యాంకుల్లో నగదు తీసుకోవచ్చన్నారు.