Mahaa Daily Exclusive

  డీఎంఈ ను కలిసిన ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్…!

Share

నూతనంగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ నరేందర్ కుమార్‌ను గురువారం హైదరాబాద్ లో ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం రిమ్స్ అభివృద్ధిపై వారితో సమీక్షించారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, వైద్య సేవలు, పలు విషయాలపై చర్చించినట్లు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ పేర్కొన్నారు.